విద్యాలయాల్లో పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలి

-విద్యార్థుల ఆరోగ్యం పై శ్రద్ద చూపాలి
-కలెక్టర్ శశాంక

మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్ 13(జనంసాక్షి)

విద్యాలయాల్లో పరిశుభ్రమమైన వాతావరణం కల్పించి విద్యార్దులకు ఆరోగ్యవంతమైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అధికారులను ఆదేశించారు. మంగళవారం మహబూబాబాద్ లోని కస్తూరిభా గాందీ బాలికల విద్యాలయాన్ని  కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యాలయ ఆవరణలోని ప్రాంగణంలో నిల్వ నీటిని వెంటనే తొలిగించి పరిశుభ్రత పనులు చేపట్టాలన్నారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం వలన అంటూ వ్యాదులు ప్రభలే అవకాశం ఉంటుందని విద్యార్దుల ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు. మరుగుదొడ్లను సక్రమంగా నిర్వహించాలని, నీటి సమస్య లేకుండా చూడాలని అవసరమైన వాటికి తలుపులు ఏర్పాటు చేసుకోవటంతో పాటు పెయింటింగ్ వేయించాలని  కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా డైనింగ్ హాల్, స్టోర్ రూం, దార్మీటరీ, టాయిలెట్స్, వంటశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. స్టోర్ రూం లోని ఆహార పదార్ధాలను తనిఖీ చేసి నిర్వహణ పట్ల పలు ఆదేశాలు చేశారు. అదేవిధంగా మెన్యూ బోర్డు, దైనందిన కార్యక్రమాల పట్టిక ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని కలెక్టర్ సూచించారు. విద్యాలయం ఆవరణంలోని నిల్వ నీటిని వెంటనే తొలగించి రేపటి నుండి పరిశుభ్రత పనులు చేపట్టాలని, మున్సిపల్, విద్యాశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. విద్యార్దుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎట్టి పరిస్థితుల్లోను ఆర్ఎంపి లచే వైద్యం చేయించరాదని ఏఎన్ఎం ను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా విద్యాశాఖాధికారి అబ్దుల్ హై, కస్తూరిభా గాందీ బాలికల విద్యాలయ ప్రత్యేక అధికారిణి బి. భవాని తహసిల్దార్ నాగభవాని, కో-ఆర్డినేటర్, మున్సిపల్, ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.