విద్యావలంటీర్లను తక్షణమే నియమించాలి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వాలంటర్లు తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని విద్యావాలంటీర్ల సంఘం డిమాండ్ చేసింది.
దౌల్తాబాద్ మండల కేంద్రంలో మానవ వనరుల కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 16 వేల మంది విద్యా వాలంటీర్లు గత సంవత్సరం తో పాటు విధుల్లో కొనసాగారు కరోనా నేపథ్యంలో మార్చి 22వ తారీకు నుండి పాఠశాలలు మూతపడటంతో అప్పటినుండి ఇప్పటివరకు విద్యా వాలంటీర్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. విద్యా వాలెంటర్ల్లు హైకోర్టును ఆశ్రయించి రీ ఎంగేజ్ చేసుకున్నారు. కోర్టు వీరికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఉపాధ్యాయుల కొరత ఉండడంతో కనీసం ఈ విద్యా సంవత్సరం అయినా విద్య వాలంటీర్లను యధావిధిగా రి ఎంగేజ్ చేసి విధుల్లోకి తీసుకోవాలని పలువురు విద్యా వాలంటీర్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పలుమార్లు రాష్ట్ర మంత్రులకు వినతి పత్రాలను సైతం ఇచ్చారు కనీసం ఈ విద్యా సంవత్సరానికి అయినా విద్యా వాలంటీర్లను వీధిలోకి తీసుకోవాలని కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో విద్యా వాలంటీర్లు పొట్టోళ్ల లింగం, షాదుల్లా, స్వామి, డి కళ్యాణి, శోభ రాణి , మహమ్మద్ అస్లాం, గణేష్ ,మల్లేశం, ఇతరులు పాల్గొన్నారు