విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలి
ఆదిలాబాద్, జనవరి 4 (): జిల్లా విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి విద్యా వ్యవస్థను దారిలో పెట్టాలని తెలంగాణ విద్యార్ధి విభాగం డిమాండ్ చేసింది. జిల్లాలో ఎన్నో సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న మండల విద్యార్థికారుల పోస్టులు భర్తీ చేయకపోవడం వల్ల పరివేక్షణ లోపించి విద్యా వ్యవస్థ కుంటుంపడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. జిల్లాలోని 52 మండలాల్లో 48 మండలాలకు ప్రధానోపాధ్యాయులు అదనపు బాధ్యతలు నిర్వహిస్తుండడంతో అక్రమాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. అదనపు బాధ్యతలు చేపట్టిన ప్రధానోపాధ్యాయులు ఇటు పాఠశాలల్లో, అటు మండల బాధ్యతలు సరిగ్గా నిర్వహించకపోవడం వల్ల విద్యార్థులు ఎన్నో సమస్యలు ఎదర్కొంటున్నారని వారు పేర్కొన్నారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి వెనుకబడిన జిల్లాలో విద్యా వ్యవస్థను దారిలో పెట్టాలని వారు డిమాండ్ చేశారు.