విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన

ఉదయం నుండి విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగులు దీక్షా స్థలంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా మా యొక్క న్యాయమైన డిమాండ్ అయినటువంటి రెగ్యులరైజేషన్ కి సంబంధించి వరలక్ష్మి వ్రతం ను ఏర్పాటు చేసి కల్వకుంట్లకవిత చిత్రపటం నకు మా యొక్క న్యాయమైన డిమాండ్లను వినతిపత్రం ఇచ్చి శరణు వేడుకోవడం జరిగిందనీ విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసన తెలిపారు. అలగే బహుజన సమాజ్ పార్టీ జిల్లా స్థాయి నాయకులు, గద్వాల తాలూకా ప్రధాన కార్యదర్శి రాజుగ దీక్షా స్థలం కి విచ్చేసి మీ యొక్క డిమాండ్ న్యాయమైనది ధర్మబద్ధమైనది బీఎస్పీ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లి మీ యొక్క సమస్యలను మా యొక్క మేనిఫెస్టోలో పెట్టే చూస్తామని తెలియజేశారు. బీసీటీఏ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ మా యొక్క దీక్ష స్థలం కి విచ్చేసి విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కి సంబంధించి మా యొక్క యూనియన్ తరపున సంపూర్ణమైన మద్దతు ఉంటుంది భవిష్యత్తులో చేసే ఎలాంటి దీక్షల కైనా మా బీసీటిఏ సంఘం మీ వెంటే ఉంటుందని సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ సమగ్ర శిక్ష జేఏసీ జిల్లా అధ్యక్షులు డి. ఉసేనప్ప, ప్రధాన కార్యదర్శి ఎం. గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు