విద్యాహక్కు చట్టం అమలుపై నిర్లక్ష్యం తగదు

ఆదిలాబాద్‌్‌, జూలై 30 : జిల్లాలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని టీయూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవన్న ఆరోపించారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో వసతి గృహాలు, పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, విద్యార్థులు చదవులను భయం భయంగా కొనసాగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అనేక పాఠశాలలో మరుగుదొడ్లు లేక బాలికలు అవస్థులు పడుతున్నారని, మధ్యాహ్నం భోజనాలనికి వంట గదులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వం బడ్జెట్‌లో కోట్ల రూపాయలు కేటాయిస్తున్న అధికారుల నిర్లక్ష్య కారణంగా నిరుపయోగం అవుతున్నాయని ఆయన ఆరోపించారు. అన్ని పాఠశాలలకు పహరి గోడలు నిర్మించాలని, నూతంగాన మంజూరు అయిన 150 భవనాల నిర్మాణాలను చేపట్టాలని, కంప్యూటర్‌ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు.