విద్యా వసతులను సద్వినియోగ పరచుకొని భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి
విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి
-మహబూబాబాద్ కలెక్టర్ శశాంక
మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్28(జనంసాక్షి)
వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్ఎంఎం ఎస్ శిక్షణ శిబిరంకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ విద్యార్థులతో ముఖాముఖి అయ్యారు. వారు పొందుతున్న శిక్షణ శిబిరంలో వసతులను ఎక్కడి నుంచి వచ్చారో వివరాలను అడిగి తెలుసుకొని, పలు అంశాలపై నిర్వాహకులతో మాట్లాడారు. భగత్ సింగ్ 116వ జయంతినీ పురస్కరించుకొని వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. 23 సంవత్సరాలకే దేశం కోసం ఉరి తీయబడ్డ స్వాతంత్ర సమరయోధులు లో ముఖ్యుడని భగత్ సింగ్ ఉద్యమ స్ఫూర్తిని కొనియాడారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా నుండే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 300లకు పైచిలుకు మంది మెరిట్ స్కాలర్షిప్ కోసం అర్హత సాధించాలనే శిక్షణ పొందుతున్నారని,
వందేమాతరం ఫౌండేషన్ నుండి 74 మంది శిక్షణ పొందారని తెలిపారు. చదువును కొనలేని పిల్లలే విద్య పై ఒక విజన్తో ఉంటారని, పోస్ట్ మెట్రిక్ ఎస్సీ ఎస్టీ స్కాలర్షిప్పులు పొంది విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని, వారం రోజుల పాటు నిర్వహించే శిక్షణ శిబిరాన్ని సద్వినియోగ పర్చుకోవాలని కలెక్టర్ అన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయుల, తల్లితండ్రుల మాటలను తూచ తప్పక పాటించాలని, బుద్ధుడు అశోక చక్రవర్తి ఎలాగైతే భోగభాగ్యాలను వదిలి ఏలా జ్ఞానం వైపు నడిచారో అలాగే మీరు కూడా ఇల్లు వదిలి వచ్చినందుకు ప్రతిఫలం సాధించి లక్ష్యం కోసం పరివర్తన చెందాలని, మన చదువుతో విజ్ఞానంతో సమాజంలో జ్ఞానం వైపు మార్పులు తీసుకురావాలని, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని, మంచి పుస్తకాలను చదివి, ప్రతి సబ్జెక్టుపై నైపుణ్యాలను పెంచుకోవాలని
8వ తరగతి నుండే ఇలాంటి స్కాలర్షిప్ల పై అవగాహన కల్పించడం విద్యార్థుల భవిష్యత్తు పై వారికి అవగాహన కల్పించడమేనని, 10 సంవత్సరాలు కష్టపడి చదివితే భవిష్యత్తు అంతా మీరు అనుకున్న విధంగా జీవించవచ్చునని కలెక్టర్ తెలిపారు. క్రమశిక్షణ అవసరమని పోటీ ప్రపంచానికి సవాలుగా చదివితే నే మీ శక్తియుక్తులు తెలుస్తాయని, విద్యార్థి వెనకాల గొప్ప నేపథ్యం ఉంటుందని, సాధన చేయడం ప్రశంసించదగ్గ అరుదైన విషయమని కలెక్టర్ తెలిపి అన్నారు. ఈ కార్యక్రమంలో వందేమాతరం ఫౌండేషన్ రవీందర్ రావు, డి ఈ ఓ అబ్దుల్ హై ,ఆర్ డి ఓ ఎల్.రమేష్, తహసిల్దార్ రాఘవరెడ్డి, విద్యాశాఖ కోఆర్డినేటర్ బుచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.