విద్యా సమస్యలపై మంత్రి సబిత ఇంద్రారెడ్డిని కలిసిన సేవలాల్ సేన నాయకులు


టేకులపల్లి, ఆగస్టు 10( జనం సాక్షి ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు విద్యా సమస్యలపై విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డిని హైదరాబాద్ లోని ఇందిరానగర్ లో కలిసి పలు విద్యసమస్యలపై సేవాలాల్ సేన జిల్లా నాయకులు మాలోత్ శివ నాయక్, నాగేందర్ నాయక్ విన్నవించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అలాంటి ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కస్తూర్బా గాంధీ పాఠశాలలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని మంత్రి దృష్టి కి తీసుకెళ్ళి సమస్యలు త్వరిత్వగన పూర్తి చేయాలని కోరారు. రాష్టంలో 23 ఏకలవ్య మోడల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కమ్ గెస్ట్ ఉద్యోగస్తులకు అందరికీ సమాన వేతనం అమలు చేయాలని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం చరావాని లో ఏకలవ్య సెక్రెటరీతో మంత్రి మాట్లాడారని తెలిపారు. ఆశ్రమ ,గురుకుల ,కే జి బి వి పాఠశాలలో నాణ్యమైన బోజనం అందించాలని కోరారు. విద్య వ్యవస్థలో అనేక సమస్యల గురించి మంత్రి దృష్టికి తీసుకువెళ్లి, వెంటనే పరిష్కరించాలని మంత్రిని వారు కోరారు. ఈ కార్యక్రమం లో రాందాస్ నాయక్,కిషోర్ ,కోటి పాల్గొన్నారు.

తాజావార్తలు