విద్యుత్తు ఛార్జీల పెంపుపై తెదేపా సంతకాల సేకరణ

ఆదిలాబాద్‌ విద్యావిభాగం: విద్యుత్తు ఛార్జీల పెంపు ప్రతిపాదనను నిరసిస్తూ తెదేపా ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లో సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బోడెం నగేష్‌ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ప్రధాన కూడళ్లలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు యూనిఫ్‌ అద్వానీ, పాయల్‌ శంకర్‌, మునిగెల నర్సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.