విద్యుత్ కోతలు నిరసిస్తూ అధికారుల నిర్డంధం
లక్ష్మణచంద : మండలంలోని తార్పెల్లిలో విద్యుత్తు కోతలను నిరసిస్తూ సోమవారం ఉదయం గ్రామస్థులు విద్యుత్ అధికారులను నిర్బందించారు. అధికారులు విద్యుత్తు బకాయిల వసూలు కోసం వెళ్లగానే గ్రామస్థుల కోతలపై ప్రశ్నించారు. గత కోంతకాలంగా విద్యుత్తు కోతలతో తల్లడిల్లుతున్న గ్రామస్థులు తీవ్ర అగ్రహంతో ముగ్గురు అధికారులను సమీపంలోని గ్రామపంచాయితీ గదిలో వేసి గదికి తాళం వేశారు. ఉన్నతాధికారులు వచ్చి నిర్థిష్టమైన హమీ ఇస్తేగాని వదిలేది లేదని వారు చెప్తున్నారు.