విద్యుత్ చట్టాన్ని కూడా వెనక్కి తీసుకోవాలి
విజయవాడ,డిసెంబర్14 (జనం సాక్షి) : అంబాని, అదానీల కోసమే వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారని, ఇప్పడుఉ రైతుల ఆందోళనలతో వాటిని వెనక్కి తీసుకున్నారని సీపీఎం నేత మధు విమర్శలు గుప్పించారు. వారిద్దరి ఆదాయం పెరుగుతుంటే రైతుల ఆదాయాలు తగ్గిపోతున్నాయన్నారు. వ్యవసాయ చట్టాలతో పాటు విద్యుత్ బిల్లును వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్ చట్టాలతో తమ గుప్పిట్లో విద్యుత్ రంగాన్ని ఉంచానుకోవడం సరికాదన్నారు. కార్పోరేట్ల మేలు కోరే చట్టాలివి అని వ్యాఖ్యానించారు. గతంలో వ్యవసాయ చట్టాలకు మద్దతుగా ఓటు వేసిన పార్టీలు నేడు రైతులకు మద్దతు తెలుపుతున్నాయని మండిపడ్డారు. విద్యుత్ చట్టాలను కూడా వెంటనే ఉపసంహరించుకోవాలని మధు డిమాండ్ చేశారు.