విద్యుత్ చార్జీల విషయంలో ప్రభుత్వ నిర్ణయం గుడ్డిలో మెల్లలా ఉంది: శంకర్రావు
హైదరాబాద్, జనంసాక్షి: విద్యత్ చార్జీలను తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గుడ్డిలో మెల్లలా ఉందని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు. పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇవాళ ఆయన స్పదించారు. చార్జీలను ఇంకొంచెం తగ్గిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కాగా, దళిత నేతలు బాబూ జగ్జీవన్‌రాం, జ్యోతిబాబూపూలేలకు భారత రత్న ప్రదానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.