విద్యుత్ సంక్షోభంపై చిన్న తరహా పరిశ్రమ ఆందోళనకు
హైదరాబాద్ : రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభంపై చిన్న తరహా పరిశ్రమలు ఆందోళన బాట పట్టనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మోపుతున్న అదనపు ఛార్జీలకు తోడు కరెంటు కోతలు విధిస్తుండటంతో పరిశ్రమలు నడపలేని స్థితికి చేరుతున్నయని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నెల 8 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ స్టేషన్ల ముందు ధర్నాలు నిర్వహించి మరుసిటి రోజు చిన్న తరహా పరిశ్రమలు మూ సేస్తున్నట్లు పరిశ్రమల సమాఖ్య ప్రకటించింది.