విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం, అగ్నికి ఆహుతి అయిన చెరుకు పంట
రాయికొడ్ అక్టోబర్ 23(జనంసాక్షి) రాయికొడ్ మండల పరిధిలోని నల్లంపల్లి గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.రైతు రాజ్ కుమార్ తనకున్న రెండున్నర ఎకరాల్లో కాయకష్టం చేసి ఆరుగాలం శ్రేమించి పండించిన చెరుకు పంటకు ఎవరో నిప్పు పెట్టినట్టుగా ఒక్కసారిగా అగ్నికి ఆహుతయ్యింది.32 కెవి విద్యుత్తు వైర్లు ఒకదానికి ఒకటి తగిలి మెరుపులు వచ్చి చెరుకు పంటకు అనడంతో పంటంత బుగ్గిపాలైంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం నల్లంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం నల్లంపల్లి గ్రామానికి చెందిన రైతు రాజ్ కుమార్ పంట పొలం దీపావళి పండుగ వేళా విషాదాన్ని మిగిలించింది. తన పంట పొలంలో నుండి 32 కెవి విద్యుత్తు వైర్లను విద్యుత్తు అధికారులు ఏర్పాటు చేసి అమర్చారు. రాను రాను ఆ వైర్లు కాస్త నెలపైకి వేలాడుతూ దర్శనమిస్తుండడంతో పలుమార్లు రైతు రాజ్ కుమార్ విద్యుత్తు శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. రైతు ఫిర్యాదును కరెంట్ అధికారులు లైట్ గా తీసుకున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి రైతు భారీ మూల్యం చెల్లించుకున్నాడు. రైతు రాజ్ కుమార్ పండించిన చెరుకు పంట కాస్త ఏపుగా పెరిగింది. ఈ క్రమంలోనే నేలకు వంగిన విద్యుత్తు వైర్లు కాస్త చెరుకు పంటను ముద్దాడయి చేతికొచ్చిన చెరుకు పంటకు అగ్గి రాజుకుంది. క్షణాల్లో ఆ మంటలు చెరుకు పంట పొలం మొత్తం వ్యాపించాయి.అగ్నికీలలు ఎగసిపడుతు రెండు ఎకరాల చెరుకు పంట అగ్నికి ఆహుతయ్యింది. పొలంలో రాజుకున్న మంటలను చూసిన స్థానికులు,రైతులు నీళ్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కేవలం విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యంతోనే తన రెండు ఎకరాల చెరుకు పంట అగ్గిపాలైదని వాపోయాడు. సుమారు 3 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందంటూ రైతు కంటకన్నీరు పెట్టుకున్నాడు. ప్రభుత్వం తనను అదుకోవలంటూ రైతు రాజ్ కుమార్ మొరపెట్టుకుంటున్నాడు. తనకు జరిగిన నష్ట పరిహారాన్ని విద్యుత్తు అధికారులే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాడు.