విద్యుత్ ఘాతానికి గురై పాడిగేదె మృతి
జనం సాక్షి, వంగూర్:
మండల పరిధిలోని నిజాంబాద్ గ్రామానికి చెందిన పాడి రైతు గంజాయి సత్యమ్మకు చెందిన పాడి గేదె వారి పొలం వద్ద రాత్రి వర్షంలో విద్యుత్ ఘాతానికి గురై మరణించడం జరిగింది. దీంతో దాదాపుగా ఎనభై వేల విలువైన పాడి గేదె మరణించడంతో తామకున్న ఏకైక ఉపాధి కోల్పోయమని ప్రభుత్వం తరపున తమకు నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతు కుటుంబం తమ గోడును వెల్లబోసుకున్నారు.