విద్యుత్ సమస్య పరిష్కరించిన మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి

దౌల్తాబాద్ మండల పరిధిలో నర్సంపల్లి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ సీనియర్ నాయకులు వేమ శ్రీనివాస్ మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి కలిసి తమ గ్రామానికి కరెంటు ఇబ్బందికరంగా ఉందని చెప్పాడు. వెంటనే స్పందించిన ఎంపీ
దౌల్తాబాద్ మండల విద్యుత్ శాఖ ఏఈ కి ఫోన్ చేసి వెంటనే మాచినపల్లి సబ్ స్టేషన్ నుంచి కరెంటు ఇవ్వాలని ఆదేశించారు. రెండు రోజులలో సబ్ స్టేషన్నుంచి కరెంటు ఇస్తానని ఏఈ హామీ ఇచ్చారు . ఈ కార్యక్రమం లో దౌల్తాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, జిల్లా కోఆప్షన్ రహీముద్దీన్,పిఎసిఎస్ చైర్మన్ వెంకటరెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ పడకండి శ్రీనివాస్ గుప్తా,ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు దేవేందర్, టిఆర్ఎస్ నాయకులు జనార్దన్ రెడ్డి, నాగరాజు గుప్తా, నాగరాజు, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.