విద్వేషాలను రెచ్చగొడుతున్న జగన్
అనంతపురం,సెప్టెంబర్24(జనంసాక్షి): రాష్ట్ర విభజన సమయంలో ఎంపీగా నోరు మెదపని జగన్ ఇప్పుడు ప్రత్యేక ¬దా పేరుతో రాద్దాంతం చేయడంలో అర్థం లేదని మాజీ మంత్రి,ప్రబుత్వ చీఫ్‌విప్ పల్లె రఘునాథ రెడ్డి అన్నారు. రాష్ట్రాభివృద్ధికి సహకరించాల్సిన ప్రతిపక్ష నాయకుడు అడ్డుకునే ప్రయత్నం చేయడం మంచిది కాదని సూచించారు. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని విద్యార్థులను,యువతను రెచ్చగొడుతున్నారని తెలుగుదేశం పార్టీ నేత ఆరోపించారు. ఈ ధోరణి మంచిది కాదన్నారు. ప్రత్యేక ¬దా వంకతో విద్యార్థులతో సదస్సులు పెట్టి వారి మనసుల్లో విషబీజాలు నాటాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చూస్తున్నారని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందటం జగన్‌కు ఇష్టం లేదని అందుకే వ్యతిరేకిస్తున్నారన్నారు. ప్రత్యేక ¬దా కోసం చివరి వరకూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రంతో పోరాడుతున్నారని అన్నారు. రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కృషి చేస్తుంటే దాన్ని ఎలా అడ్డుకోవాలా అని జగన్ చూస్తున్నాకరన్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రతిపక్షనేత అడుగడుగునా అడ్డు తగలటం బాధాకరమన్నారు. ఇప్పటికైనా జగన్ తన తప్పు తెలుసుకుని సహకరించాలన్నారు. అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉన్నా తప్పించుకున్నారని అన్నారు.