విధినిర్వహణలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి

పరిగి,జనవరి24(జ‌నంసాక్షి): విధి నిర్వహణలో ఉండే వాహన చోదకులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పరిగి డివిజన్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. గురువారం ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో పరిగి డిపోలో వాహన చోదకుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డ్రైవర్లు మానసిక ప్రశాంతత కలిగి ఉండాలని సూచించారు. వాహనాలకు వెనుక భాగాన ప్రమాదాల నివారణలో భాగంగా రేడియం స్టిక్కర్‌ను అతికించాలని సూచించారు. చిన్న వాహనాలకు చెందిన డ్రైవర్లు ముందు భాగంలో ఎక్కువ బరువు లేకుండా చూసుకోవాలని తద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చని తెలిపారు. అనంతరం పాఠశాల విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్టీసీ డీవీఎం(డివిజనల్‌ మేనేజర్‌) భవానీ ప్రసాద్‌, డిపో మేనేజర్‌ మోహన్‌ రావు, ఎస్సై షర్ఫూద్దీన్‌ పాల్గొన్నారు. ఉత్తమంగా ఎంపికైనా ముగ్గురు డ్రైవర్లను సన్మానించారు.