వినాయక ఉత్సవాలకు ముందస్తు ప్రణాళిక
గుంటూరు,సెప్టెంబర్1(జనం సాక్షి): వినాయక చవితి ఉత్సవాలు రానున్న నేపథ్యలంలో నిమజ్జనాల వరకు ప్రత్యేక చర్యలు చేపట్టామని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు రంగం సిద్దం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు బందోబస్తుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు అర్బన్ ఎస్‌పి ఆదేశాలు జారీచేశారు. పండగల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్థుగా బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలన్నారు. వినాయక పందిళ్ల వద్ద తగు బందోబస్తును ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. నిమజ్జన సమాచారం ముందస్తుగా తెలుసుకుని ఆయా మార్గాలలో పర్యవేక్షణ తప్పనిసరని సూచించారు.
——————