వినాయక చవితి పండుగకు మట్టి ప్రతిమలనే వినియోగించాలి
జిల్లా కలెక్టర్
యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి
పర్యావరణ పరిరక్షణలో బాగంగా వినాయక చవితి పండుగను మట్టి విగ్రహాలతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటన ప్రజలను కోరారు.
ఈ నెల 31 వ తేదీన వినాయక చవితి సందర్భంగా ప్రజలు అందరూ మట్టి విగ్రహాలు కొనుగోలు చేసేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసిన్నట్లు, విగ్రహాల తయారీకి కుమ్మర మాస్టర్స్ కు శిక్షణ ఇచ్చి జిల్లాలో యంత్రాల ద్వారా మట్టి వినాయక విగ్రహాలను తయారు చేసి విక్రయించేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తి అయిన్నట్లు, ఒకే రకమైన వినాయక విగ్రహం కాకుండా పలు ఆకృతులలో విగ్రహాలను తయారు చేసేందుకు వీరు శిక్షణ పొంది ఉన్నారని, వీరు తయారు చేసిన అందమైన విగ్రహాలను ప్రజలు ఉపయోగించుకోవాలని, దీని ద్వారా పర్యావరణ పరిరక్షణ చేసిన వారు అవుతామని జిల్లా కలెక్టర్ అట్టి ప్రకటనలో తెలిపారు.