వినాయక మంటపాలకు అనుమతి తప్పనిసరి

పోలీసుల స్పష్టీకరణ

కడప,సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): ఈ నెల 13న వినాయక చవితి సందర్భంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకునే వారు కచ్చితంగా పోలీసుల అనుమతి తీసుకోవాలని మైదుకూరు అర్బన్‌ సిఐ రాజేంద్ర యాదవ్‌ తెలిపారు. సోమవారం మైదుకూరు అర్బన్‌ సిఐ రాజేంద్ర, ఎస్సై రామకృష్ణలు కలిసి విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నెల 13న వినాయక చవితి సందర్భంగా మైదుకూరు మండల పరిధిలో విగ్రహాల ఏర్పాటుకు వారం రోజుల ముందే పోలీసుల అనుమతి పొందాలని అన్నారు. విగ్రహాలు ఏర్పాటు చేసుకునే ప్రాంతం, నిర్వాహకుల వివరాలు, కార్యక్రమాల నిర్వహణ వివరాలు , నిమజ్జనం తేది, నిమజ్జనం చేసే ప్రాంతం, విగ్రహం పొడవు, బరువు, ఎన్ని రోజులు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు, మండపం వివరాలు, తదితర పూర్తి వివరాలను దరఖాస్తులో రాసి స్థానిక పోలీస్టేషన్‌ అనుమతి తీసుకోవాలని తెలిపారు. విగ్రహం వద్ద తప్పనిసరిగా ఇద్దరు వాలంటీర్లు కాపలా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విద్యుత్‌ శాఖ అనుమతి, మైక్‌ పర్మిషన్‌ తీసుకోవాలని కోరారు. ఉత్సవాలకు సంబంధించిన దరఖాస్తులను పోలీస్‌ స్టేషన్‌లో అందుబాటులో ఉంచామని ఎస్సై రామకృష్ణ పేర్కొన్నారు.

 

తాజావార్తలు