వినియోగదారుల సంఘాల రాష్ట్ర సమాఖ్యలో జిల్లా ప్రతినిధులు

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 1 (జ‌నంసాక్షి):తెలంగాణా రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య నూతన కార్యకవర్గం ఎన్నికలు గత ఆదివారం నల్లగొండ జిల్లాకేంద్రంలో జరిగాయి. కరీంనగర్‌ జిల్లాకు చెందిన వినియోగదారుల మండలి ప్రతినిధులు విలక్ష్మణ్‌కుమార్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా, సయ్యద్‌ ముజఫర్‌ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఎన్నికయ్యారు. జగిత్యాలనుంచి హెచ్‌ చంద్రప్రకాశ్‌, సిద్దిపేటనుంచి హుస్నాబాద్‌కు చెందిన ఎం మోహన్‌రెడ్డి, సిరిసిల్లనుంచి ఝాన్సీ శుక్లా, పెద్దపల్లినుంచి శంకర్‌లు రాష్ట్రకమిటీ కి ఎంపికయ్యారు. నూతన కార్యవర్గానికిఎంపికైన వారిని రాష్ట్ర గౌరవాద్యక్షుడు ఎన్‌ శ్రీనివాస్‌, జిల్లా బాద్యులు చంద్రప్రభాకర్‌, ప్రకాశ్‌ నారాయణ, ఆర్వీరావు, చందన్‌, మనోహర్‌, గంగాదర్‌ తదితరులు ఆబినందించారు.