విప్లవ ధీరుడు డివి కృష్ణ.
భారత విప్లవోద్యమంలో తన జీవితాంతం ప్రజల కోసం పనిచేసిన విప్లవ ధీరుడు డివి కృష్ణ సిపిఐ (ఎంఎల్) ప్రజా పందా డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రవి అన్నారు. డివి కృష్ణ సిపిఐ (ఎంఎల్) ప్రజా పందా లో 45 సంవత్సరాలు పనిచేసి ఈ ఆదివారం క్యాన్సర్ బారిన పడి చనిపోయాడని అన్నారు. ఆయన సంతాప సభలు జూన్ 27 నుండి జూలై 10 వరకు జరపాలని జరపాలని పార్టీ పిలుపునిచ్చిందని అన్నారు. అందులో భాగంగానే ప్రజా పంద రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసి మరణించిన డివి కృష్ణ నేడు తొర్రూర్ లో చిత్రపటానికి నివాళులు అర్పించి ఆయన ప్రసంగించారు. భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం సాగిన భారత విప్లవోద్యమ అగ్ర నాయకుడు పనిచేసిన డివి కృష్ణ ప్రజాయుద్ధ పందా అభివృద్ధి చేయటంలో సిద్ధాంతపరంగా నిర్మాణ పరoగా నిర్వీరమ కృషి చేసిన ఘనుడు అని అన్నారు. బీడీ కార్మికుల జీవితాలలో వెలుగును నింపటానికి అనేక మెరుగైన వేతన ఒప్పందాలు చేశాడని, బొగ్గు గని కార్మికులు, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా కార్మికులు ఇలా అన్ని రంగాల కార్మికుల కనీస వేతనాల కోసం పోరాడాడని అన్నారు. సిరిసిల్ల జగిత్యాల గోదావరి లోయ పోరాటాలలో కీలక పాత్ర పోషించి భూమిలేని నిరుపేదలైన అన్ని వర్గాల ప్రజలకు భూమిని సాధించిపెట్టే సిద్ధాంతాన్ని ఆచరణలో రూపొందించి అమలు చేశాడని అన్నారు.సిరిసిల్ల తాలూకాలో నిమ్మ పల్లి భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో ముఖ్యమైన భూమిక పోషించి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారత దేశ వ్యాప్తంగా పీడిత ప్రజలకు వైద్యం చేసే కృషిని జీవితాంతం సాగించాలని అన్నారు.దేశంలో హిందూ మతోన్మాదం ఒకవైపు, అప్రకటిత నిర్బంధాన్ని రాష్ట్రంలో మరోవైపు అమలు చేస్తున్న నేటి పరిస్థితుల్లో పీడిత ప్రజలకు మార్గదర్శకంగా ఉండాల్సిన డివి కృష్ణ అకాల మృతి విప్లవద్యమాలకు తీరని లోటు అని సిపిఐ (ఎంఎల్ )ప్రజాపంద తోరూర్ సబ్ డివిజన్ కార్యదర్శి ముంజంపల్లి వీరన్న అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీమా బాలు అర్వ పల్లి వెంకన్న, ఎం యాకయ్య, శ్రీను ప్రసాద్ వెంకన్న సంతోష్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.