విప్ రేగా కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేసిన జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత.
బూర్గంపహాడ్ ఆగస్టు12 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత రక్షాబంధన్ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావుకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. కరకగూడెం మండలం సమత్ భట్టుపల్లి గ్రామపంచాయతీ లోని తన స్వగ్రామమైన కుర్నవల్లిలో విప్ రేగా కాంతారావు స్వగృహం నందు అన్న_ చెల్లెలు అక్క_ తమ్ముళ్లు పవిత్ర బంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా విప్ రేగా కి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కరగకగూడెం ఎంపీపీ రేగా కాళికా, లక్ష్మీపురం వార్డుసభ్యులు పాలం దివాకర్ రెడ్డి, రేగా కుటుంబ సభ్యులు, పలువురు టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.