విభజన సమస్యలపై ఆందోళన వీడని టిడిపి

పార్లమెంట్‌ లోపలా,వెలుపలా నిరసనలు

కాటన్‌ వేషంలో ఎంపి శివప్రసాద్‌ ప్రత్యక్షం

న్యూఢిల్లీ,జూలై26(జ‌నంసాక్షి): పార్లమెంటు బయటా, లోపల కూడా టీడీపీ ఎంపీలు నిరసన కొనసాగిస్తున్నారు. తమతమ స్థానాల్లో కూర్చునే ఏపీకి అన్యాయం చేయాలని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని మౌనంగా నిరసన తెలుపుతున్నారు. ఏపీకి ప్రత్యేక ¬దా ఇవ్వాలని, విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలని, విభజన చట్టంలో ఇచ్చిన హావిూలన్నీ నెరవేర్చాలన్న డిమాండ్లను గురువారం కూడా ఎంపీలు లోక్‌సభ దృష్టికి తీసుకువచ్చారు. ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయానికి నిరసనగా పార్లమెంటు ఆవరణలో టీడీపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. ఎంపీ శివప్రసాద్‌ తనదైన రీతిలో యధావిధిగా కొత్తవేషంలో నిరసన తెలిపారు. సర్‌ ఆర్దర్‌ కాటన్‌ వేషధారణలో ఏపీకి కేంద్రం చేసిన అన్యాయాన్ని మరోసారి ఎలిగెత్తి చాటారు. వర్షంలో తడుస్తూనే ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ‘స్వదేశీయుడైన మోదీ ఆంధ్రరాష్ట్రంతో చెలిమి చేసి, గెలిచి ప్రధాని అయ్యాక ఇప్పుడు మాట తప్పుతున్నారని, ప్రధానిగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి….వితండ వాదం మాని, సకాలంలో నిధులిచ్చి పోలవరాన్ని పూర్తి చేయండి…చరిత్రలో నిలిచిపోతారు’ అని ఎంపీ శివప్రసాద్‌ అన్నారు. ‘పార్లమెంటులో ఎంతో మంది వచ్చారు పోయారు…విూరు కూడా పోతారని అయితే మనిషిగా వెళ్లండి’ అని సూచించారు. అలా కాకుండా మొండి వైఖరితో ముందుకు వెళ్తే ప్రజలే చూసుకుంటారని ఎంపీ శివప్రసాద్‌ అన్నారు.