విభజన సమస్యలపై దక్కని మాటసాయం

అవిశ్వాస చర్చలో ప్రధాన సమస్యలను పట్టించుకోని కేంద్రం

న్యూఢిల్లీ,జూలై21(జ‌నం సాక్షి): అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి విభజన సమస్యలను ఇరు రాష్ట్రాల నేతుల ప్రస్తావించినా కేంద్రం వీటిపై మాటమాత్రంగా అయినా ప్రస్తావించలేదు. అమలు చేస్తామని చెప్పలేదు. నాలుగేళ్లుగా వివిధ సమస్యలు నానుతున్నా ఎందుకు ఆలస్యం జరిగిందీ చెప్పలేకపోయారు. ఇదేదో ఇద్దరు చంద్రుల పంచాయితీలాగా పరోక్షంగా మోడీ ప్రస్తావించారే తప్ప ప్రజల వ్యవహారంగా చూడలేదు. హైకోర్టు విభజన, ఉద్యోగుల పంపకం, ఆస్తుల పంపకం, ఏడుమండలాల వ్వయహారం, అమరావతి నిర్మాణం, విశాఖ రైల్వేజోన్‌, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, కడప, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీల ఏర్పాటు వంటి అనేక విషయాల్లో కనీసంగా ఒక్కదానిని కూడా ప్రస్తావించకుండా వదిలేశారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడగానే మొదటి మంత్రివర్గ సమావేశంలోనే తెలంగాణకు అన్యాయం చేశారని, ఖమ్మం జిల్లా పరిధిలో ఉన్న ఏడు మండలాలను పోలవరం ప్రాజెక్టు పేరుతో అన్యాయంగా ఏపీలో విలీనంచేస్తూ ఆర్డినెన్స్‌ తెచ్చారని టీఆర్‌ఎస్‌పక్ష ఉపనేత బోయినపల్లి వినోద్‌కుమార్‌ ప్రస్తావించారు. తెలంగాణకు ప్రధాని నరేంద్రమోదీ చేసిన అన్యాయాన్ని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరని లోక్‌సభలో అన్నారు. మోదీపై ప్రజలు పెట్టుకున్న ఒక్క ఆశను కూడా ఈ నాలుగేండ్లలో నెరవేర్చలేదని చెప్పారు. అయినా ఒక్కమాటయిన ఆప్రధాని మోడీ తన ప్రసంగంలో ప్రస్తావించలేదు. తెలంగాణలో ఉన్న సీలేరు హైడల్‌ ప్రాజెక్టును అన్యాయంగా ఏపీలో కలిపారని కేంద్రాన్ని విమర్శించారు. ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ ¬దా ప్రకటించి వేల కోట్ల నిధులుఇస్తున్నదని, కానీ.. తెలంగాణ ప్రభుత్వం 37 లక్షల ఎకరాల బీడు భూములను సాగులోకి తీసుకువచ్చేందుకు చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపాయి ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇప్పటికైనా జాతీయ ¬దా ప్రకటించాలని వినోద్‌ కుమార్‌ చేసిన డిమాండ్‌పైనా ప్రధాని స్పందించలేదు.బయ్యారం ఉక్కు పరిశ్రమకోసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రధానంగా హైకోర్టు విభజన వెంటనే చేయాలని ఎంపీ వినోద్‌ డిమాండ్‌ చేసినా సమాధానం లేదు. ఇక విశాఖ రైల్వేజోన్‌, కడప ఉక్కు ఫ్యాక్టరీ, అమరావతి నిర్మాణం వంటి ప్రధానాంశాలను కూడా మాటమాత్రంగా అయినా ప్రధాని ప్రస్తావించలేదు. ఎపికి అండగా ఉంటమన్న మోడీ అది ఏ రకంగా నఅ/-నది చెప్పలేదు. ప్రత్యేక ¬దా ఇవ్వడానికి 14వ ఆర్థిక సంఘం అడ్డమొచ్చిందని ప్రధాని స్థాయిలో చెప్పడం ఎంతవరకు సబబో ఆలోచించాలి. మొత్తంగా హావిూలను గాలికి వదిలేశారు. కనీసంగా అయినా విూ వెనక మేమున్నామని చెప్పే సాహసం కూడా కేంద్రం చేయలేకపోయింది.