విభజన సమస్యలు పరిష్కరించమంటే.. 

నాపై విమర్శలా?
– ఢిల్లీని మించిన రాజధాని నిర్మించుకోవచ్చని నమ్మబలికారు
– తర్వాత హావిూలను పక్కనపెట్టి మోసం చేశారు
– యూటర్న్‌ నాది కాదు హావిూలు అమలుచేయని విూది యూటర్న్‌ విధానం
– నాలుగేళ్లపాటు ఓపిగ్గా హావిూల పరిష్కరిస్తారని ఎదురుచూశాం
– 14వ ఆర్థికసంఘం పేరుతో ¬దాను పక్కదారి పట్టించారు
– ఎవ్వరికీ ప్రత్యేక ¬దా లేదని చెప్పారు
–  కానీ ఇప్పటికీ 11 రాష్ట్రాలకు రాయితీలు ఇస్తున్నారు
– రాష్ట్రాలతో సంబంధం కొనసాగించే విధానం ఇదేనా?
– ప్రధాని పదవిలో ఉండి ఇలా ఎలా మాట్లాడుతారు
– ఢిల్లీలో విూడియాతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
న్యూఢిల్లీ, జులై21(జ‌నం సాక్షి) : పార్లమెంట్‌లో మోదీ ప్రభుత్వానికి సంఖ్యాబలం ఉందని తెలుసని.. అయినా తాము అవిశ్వాస తీర్మానం పెట్టామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఢిల్లీలో చంద్రబాబు జాతీయ విూడియాతో మాట్లాడారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపిన పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇకముందూ ఏపీ ప్రజలకు న్యాయం చేయడంలో సహకరిస్తారని ఆశిస్తున్నానన్నారు. 15 ఏళ్ల తర్వాత తామే అవిశ్వాసం పెట్టామని చెప్పారు. మెజారిటీకి, నైతికతకు మధ్య జరుగుతోన్న పోరాటమిదని పేర్కొన్నారు. ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన కేంద్రం ఆ పని చేయలేకపోయిందని, ఏపీ ప్రజలకు ఇచ్చిన హావిూలు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. తిరుపతి, నెల్లూరులో ఇచ్చిన హావిూలను నెరవేర్చాలని చాలాసార్లు కేంద్రాన్ని కోరామని చంద్రబాబు చెప్పారు. ఢిల్లీని మించిన రాజధాని నిర్ముంచుకోవచ్చని నమ్మబలికారని.. తర్వాత పట్టించుకోలేదని అన్నారు. తిరుపతిలో వెంకన్న సాక్షిగా ఇచ్చిన హావిూని మరిచిపోయారని విమర్శించారు. విభజన చట్టంలోని హావిూలను మాత్రమే నెరవేర్చాలని ప్రధానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. విభజన సమయంలో ఎన్నో హావిూలు ఇచ్చి.. ఒక్కటీ నెరవేర్చలేదు. కేంద్ర పెద్దలందరినీ కలిసి పలుమార్లు విజ్ఞప్తి చేశామని.. కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు శతవిధాలు ప్రయత్నించామని చెప్పారు. నాలుగేళ్లు చూశాక.. ఓపిక నశించి కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పుకున్నామని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ప్రత్యేక ¬దా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పిందనడం అవాస్తవమని.. ఆర్థిక సంఘం సభ్యుడు టి.గోవిందరావు అలాంటి సిఫార్సు చేయలేదని చెప్పారని తెలిపారు. రాష్ట్ర విభజనతో నష్టపోయామని.. ఆదుకోమని అడిగితే మాపైనే విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఎవ్వరికీ ప్రత్యేక ¬దా లేదన్నారని.. కానీ ఇప్పటికీ 11 రాష్టాల్రకు రాయితీలు ఇస్తున్నారని గుర్తుచేశారు. కేంద్రం నమ్మకద్రోహం – కుట్ర రాజకీయాలపై ధర్మపోరాటం చేస్తున్నామని, రాష్టాన్రికి ఇచ్చిన హావిూలు నెరవేర్చేదాకా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టంచేశారు.
‘వైకాపా ట్రాప్‌లో పడ్డారని ప్రధాని నిన్న అన్నారు.. నేను ఎప్పటికీ తప్పు చేయను. తెలంగాణతో మేం తగాదాలు పెట్టుకున్నామని మోదీ అన్నారు. కేసీఆర్‌ మెచ్యూరిటీగా వ్యవహరించారని నన్ను విమర్శించారు. అవినీతి పార్టీతో లాలూచీ పడ్డామని మాపై విమర్శలు చేశారు.  పార్లమెంట్‌లో ఆ పార్టీ అధ్యక్షుడు కోర్టులో ఉంటే.. మా ఎంపీలు పార్లమెంట్‌లో ఉన్నారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి
ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతారా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇద్దరు ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి ఎప్పుడు మాట్లాడారని ఆయన అడిగారు. యూ టర్న్‌ తనది కాదని, ఇచ్చిన హావిూలు అమలు చేయని విూదే యూటర్న్‌ అని కేంద్రాన్ని ఉద్దేశించి చంద్రబాబు విమర్శించారు. అనీతిని సహించబోమంటూ గాలి అనుచరులకు టికెట్లు ఇచ్చారని, వైసీపీ ట్రాప్‌లో పడ్డారని మోదీ తనతో అన్నారని, తానెప్పుడూ తప్పుచేయనని మోదీతో చెప్పానని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రధాని ఆ మాటలు అనడం ఏపీ ప్రజలను అవమానించడమేనని అని చంద్రబాబు అన్నారు. జగన్‌ కోర్టులో ఉంటే తమ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌లో ఉన్నారని వైసీపీని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్రాలతో  సంబంధాలు కొనసాగించే పద్ధతి ఇదేనా అని చంద్రబాబు ప్రశ్నించారు.