విమానానికి ముప్పు తప్పింది

టాటాల ఆధ్వర్యంలో నడుస్తున్న విస్తారా విమానానికిలో నడుస్తున్న విస్తారా విమానానికి (Vistara flight) ముప్పు తప్పింది. విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. అయితే ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

గురువారం ఉదయం విస్తారా విమానం.. 146 మంది ప్రయాణికులతో ఢిల్లీ నుంచి అమృత్‌సర్‌ వెళ్తున్నది. ఉదయం 10.15 గంటలకు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ అయింది. అయితే గాలిలోకి ఎగిరిన కొద్దిసేపటికే విమానం ఇంజిన్‌లో పైలట్‌ సాంకేతిక సమస్యను గుర్తించాడు. దీంతో పైలట్ ఎయిర్‌పోర్ట్‌ అధికారులను సంప్రదించాడు.

ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అధికారులు అనుమతివ్వడంతో ఇందిరాగాంధీ విమానాశ్రయంలో దించాడు. అప్పటికే ఆరు ఫైర్‌ ఇంజిన్లు రన్‌వైపే సిద్ధంగా ఉంచారు. అయితే విమానం క్షేమంగా కిందికి దిగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులంతా ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు.