వియ్యంకుల కౌగిలిలో విద్యావ్యవస్థ భ్రష్టు
మండిపడ్డ ఎబివిపి
ఏలూరు,జూలై14(జనం సాక్షి): ఆంధ్రప్రదేశ్‌లోని విద్యావ్యవస్థ స్థితిగతులపై ఏబీవీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరుగుతున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో శనివారం వారు మాట్లాడుతూ.. బాబుకు జాబ్ వచ్చింది కానీ, యువతకు ఉద్యోగాలు రావడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో నారాయణ, శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యాసంస్థల దందా పెరిగిపోయిందని ఆరోపించారు. వియ్యంకుల చేతిలో ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థ నలిగిపోతోందని మండిపడ్డారు. ఈ సమావేశాల అనంతరం రాష్ట్రంలోని విద్యావ్యవస్థపై సమగ్ర నివేదికని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, గవర్నర్ నరసింహన్‌కు అందజేయనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా మహిళలకు ప్రత్యేకంగా ఫిజికల్ ఎడ్యూకేషన్ సంస్థలు ఏర్పాటు చేయాలని ఏబీవీపీ సంయుక్త కార్యదర్శి కౌశిక్ డిమాండ్ చేశారు.