విశాఖలో ఆదిభట్ల జయంతి వేడుకలు
విశాఖపట్టణం,ఆగస్ట్28(జనం సాక్షి): హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు 154వ జయంతిని మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు విశాఖలో ఏర్పాట్లు జరిగాయి. దీనికి సంబంధించిన ప్రచార పోస్టర్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. నగర సంకీర్తనం, మూడురోజుల పాటు దేశ వ్యాప్తంగా హరికథకులుగాపేరు గాంచిన వారితో హరికథా గానం ఏర్పాటుచేసినట్టు ఆదిభట్ల నారాయణదాసు సేవాసమితి వ్యవస్థాపకురాలు కళ్యాణి వెల్లడించారు.