విశాఖలో భారీ అగ్నిప్రమాదం

– రెండు సినిమా థియేటర్లు దగ్ధం

– రూ.3కోట్ల ఆస్తి నష్టం

విశాఖపట్టణం, సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి) : విశాఖ నగరంలోని గాజువాకలో విద్యుదాఘాతంతో రెండు సినిమా థియటర్లు దగ్ధమయ్యాయి. గాజువాక ప్రధాన రహదారిలో ఒకే భవనంలో కింది, పై అంతస్తుల్లో కన్య, శ్రీకన్య థియేటర్లు ఉన్నాయి. సోమవారం తెల్లవారుజామున థియేటర్ల నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన స్వీపర్‌ చిట్టెమ్మ యజమానికి సమాచారం అందించింది. ఆయన ఫైరిజన్లకు సమాచారం ఇచ్చి అక్కడికి వచ్చేసరికే థియేటర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఎనిమిది ఫైరిజన్ల సాయంతో అగ్నిమాపక బ్బంది చాలాసేపు ప్రయత్నించిన తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ఘటనలో రెండు థియేటర్లలోని తెరలు, సీట్లు, ప్రొజెక్టర్లు, ఏసీ యూనిట్లు పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ.3కోట్ల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు యజమాని తెలిపారు. విశాఖ డీసీపీ ఫకీరప్ప సహా పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపిస్తామని డీసీపీ పేర్కొన్నారు. విద్యుదాఘాతంతోనే ప్రమాదం సంభవించినట్లు థియేటర్‌ మేనేజర్‌ రామారావు తెలిపారు. ఇదిలా ఉంటే ఒక్కసారిగా అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందారు. ఫైరింజన్ల సకాలంలో వచ్చి మంటలనుఅ దుపు చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు.

 

తాజావార్తలు