విశాఖలో మరో అంతర్జాతీయ సదస్సు

నవంబర్‌లో విద్యాసదస్సుకు సన్నాహాలు

విశాఖపట్నం,ఆగస్ట్‌2(జ‌నం సాక్షి): విశాఖ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానుంది. ఈ ఏడాది నవంబర్‌ 15 నుంచి 17 వరకు మూడు రోజులపాటు సదస్సు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అధునాతన విద్యా విధానాలను అమలులోకి తెచ్చి రాష్ట్రాన్ని విద్య, విజ్ఞాన కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది. అందులో భాగంగానే గతేడాది డిసెంబర్‌ 16 నుంచి 18 వరకు నగరంలో అంతర్జాతీయ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఎడ్యుకేషన్‌ కాన్ఫరెన్స్‌ ఫర్‌ హ్యూమానిటీ(టెక్‌) సదస్సు నిర్వహించారు. అదే తరహాలో ఈ ఏడాది కూడా విశాఖలోనే ఈ అంతర్జాతీయ విద్యా సదస్సునునిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సదస్సు నిర్వహణపై యునెస్కో చీఫ్‌ అడ్వయిజర్‌ (ఈవెంట్స్‌) కెయిన్‌, రాష్ట్ర కళాశాలల విద్యా కమిషనర్‌ సుజాతశర్మ, విశాఖ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, కళాశాలల ప్రిన్సిపాళ్లు సమావేశమై చర్చించారు. జిలల్‌ఆ అధికార యంత్రాంగం ఏర్పాట్లను పర్యవేక్షించనుంది. విశాఖనగరంలో అంతర్జాతీయ విద్యా సదస్సును నవంబరు 15 నుంచి 17 వరకూ నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యా కమిషనర్‌ సుజాతాశర్మ వెల్లడించారు. గత ఏడాది డిసెంబరులో ఇదే తరహా సదస్సును విశాఖలో నిర్వహించామని, అదే స్థాయిలో ఈ ఏడాది యునెస్కో సహాయంతో ఏర్పాటుచేస్తున్నట్లు ఆమె వివరించారు. సదస్సు ప్రారంభ, ముగింపు సభలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు వస్తారని, వారికి అవసరమైన వసతి, ఇతర ఏర్పాట్లు పక్కాగా చేయాలని జి/-లా అధికారులకు సూచించారు. దేశ, విదేశాల నుంచి భారీగా ప్రతినిధులు సదస్సుకు హాజరవుతారని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో అమలు చేస్తోన్న ఆధునిక విద్యా విధానాలను రాష్ట్రంలో అమలు చేసి, విద్యా, విజ్ఞాన కేంద్రంగా అభివృద్ధి చేసే క్రమంలో గత ఏడాది టెక్‌ కాన్ఫరెన్సును నిర్వహించామన్నారు. నాటి సదస్సులో చర్చించిన అంశాల్లో కొన్నింటిని రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. సదస్సుకు హాజరయ్యే వారు తమ పేర్లను సెప్టెంబరు 15వ తేదీ లోపు నమోదు చేసుకోవాలన్నారు.

 

తాజావార్తలు