విశాఖలో వ్యక్తి దారుణ హత్య
విశాఖ: నగరంలో ఓ వక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బీచ్ రోడ్ కోస్టల్ బ్యాటరీ క్వార్టర్స్ వద్ద అప్పా హోటల్ వంట వాడిగా చేరిన రవి నిన్న రాత్రి స్నేహితునితో కలిసి బయటకు వెళ్లి రక్తపు మడుగులో శవమై తేలాడు. మృతదేహాన్ని కేజిహెచ్ తరలించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.