విస్తృతంగా టిఆర్ఎస్ పార్టీ ప్రచారం

మునుగోడు అక్టోబర్22(జనం సాక్షి):
ఉపఎన్నికల్లో భాగంగా మండలంలోని కలవలపల్లి గ్రామంలో గడప గడపకు తిరిగి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వంటపాక వెంకన్న గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.శనివారం గ్రామంలో గడప గడపకు తిరిగి ప్రచారంలో భాగంగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.అయన వెంట టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.



