విహారయాత్రకు వెళ్తున్న విద్యార్థుల బస్సు బోల్తా : ఇద్దరు విద్యార్థుల మృతి

కర్ణాటక : కర్ణాటక రాష్ట్రంలోని హసన్‌ వద్ద  విహారయాత్రకు వెళ్తున్న విద్యార్థుల బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా మరో 10 మంది గాయపడ్డారు. వీరంతా మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తిలోని వికాస్‌ ఎక్స్‌లెంట్‌ పాఠశాల విద్యార్థులు, వీరు విహార యాత్ర కోసం బెంగుళూరు, మైసూరు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.