విూడియా సమావేశంలో భోరుమన్న చంద్రబాబు
వెక్కివెక్కి ఏడ్చిన టిడిపి అధినేత
అసెంబ్లీలో జరిగిన పరిణామాలనూ తీవ్ర ఆవేదన
సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటనలు చూడలేదు
తన భార్యపై విమర్శలు చేశారని తీవ్ర ఆందోళన
అమరావతి,నవంబర్19(జనం సాక్షి ): అసెంబ్లీలో తన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను తలచుకుని చంద్రబాబు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన తర్వాత నిర్వహించిన ప్రెస్‌విూట్లో ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. వెక్కివెక్కి ఏడ్చారు. ఇన్నేళ్లరాజకీయాల్లోఎప్‌ఉడూ ఇలాంటి అవమానాలను ఎదుర్కోలేదన్నారు. తనభార్యపై, కుటుంబంపై అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు పరుష వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోలేదనీ, కానీ కుటుంబంపై ఇంత దారుణంగా విమర్శలు చేయడంతో సహించలేకపోతున్నానని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంత అయ్యారు. గతంలో శాసనసభలో ఆవేశాలు, కోపాలుండేవని, సభ వాయిదా పడేదని, తిరిగి సమావేశమైన తర్వాత ఎవరిది తప్పయితే వారికి స్పీకర్ చెప్పేవారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. శుక్రవారం శాసనసభలో చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులను వైసీపీ నేతలు అవహేళన చేస్తూ విమర్శలు చేశారు. దీనిపై ఆయన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. అప్పుడు తన తల్లిని దూషించారు.. ఇప్పుడు తన భార్య విషయం తీసుకువచ్చి అవమానించారంటూ భోరున విలపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో తన తల్లిని దూషించారని చంద్రబాబు తెలిపారు. దీనిపై గట్టిగా వైఎస్‌ను ప్రశ్నించానన్నారు. దీంతో తప్పు జరిగింది.. క్షమించమని అడిగారన్నారు. ఇవాళ వైసీపీ నేతలు నీచ రాజకీయాల కోసం తన భార్యను లాగే ప్రయత్నం చేశారన్నారు. రెండున్నరేళ్లుగా తనను అవమానిస్తూ వస్తున్నారని, ప్రజల కోసం భరిస్తున్నానన్నారు. దేశం కోసం తప్పితే స్వార్థం కోసం ఆలోచించలేదన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. తన భార్య ఏ రోజూ రాజకీయాల్లోకి రాలేదన్నారు. పెద్ద పెద్ద మహానాయకులతో పని చేశానని, జాతీయ స్థాయిలో కూడా అనేక మంది నాయకులతో పని చేశానని చంద్రబాబు అన్నారు. గడిచిన రెండున్నరేళ్లుగా సభలో ఎన్నో విమర్శలు.. ప్రతి విమర్శలు చేసుకున్నామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ.. రూలింగ్‌లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడూ ఇలాంటి అనుభవాలు తాను చూడలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ పరిణామాలపై టీడీపీ అధినేత తీవ్ర మనస్తాపం వ్యక్తం చేశారు. సభలో జరిగిన పరిణామాలను గుర్తు చేసుకుంటూ ప్రెస్‌విూట్‌లో కన్నీళ్లు పెట్టుకున్నారు. సభలో జరిగిన పరిణామాలను గుర్తు చేసుకుంటూ ప్రెస్‌విూట్‌లో కన్నీళ్లు పెట్టుకున్నారు. ముఖ్యంగా తన భార్యను రాజకీయాల్లోకి లాగడంపై ఆయన భోరున విలపించారు . ’నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి అవమానాలు ఎదుర్కోలేదు. కానీ గత రెండున్నరేళ్లుగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్ని విధాలా అవమానాలు ఎదుర్కొంటున్నాను. ఈ ప్రభుత్వం మా పార్టీ నాయకులు, కార్యకర్తలను వ్యక్తిగతంగా వేధిస్తోంది. కేసుల పేరుతో బెదిరిస్తోంది. బూతులు తిడుతూ దాడులకు పాల్పడుతున్నారు. వీటన్నింటినీ ప్రజలు చూశారు. తాజాగా కుప్పం ఎన్నికలు పూర్తయిన తర్వాత మా డిప్యూటీ ప్లోర్ లీడర్ బీఏసీ విూటింగ్‌కి వెళితే ’ విూనాయకుడిని చూడాలనుంది. రమ్మనండి’ అని సాక్షాత్తూ సీఎం వ్యంగ్యంగా మాట్లాడినా భరించాం. అన్నిటిని భరించి అసెంబ్లీ సమావేశాలకు వెళితే చివరకు నా భార్యను కూడా ఇలాంటి ఈ డర్టీ పాలిటిక్సలోకి లాగారు. రాజకీయాల్లో నన్ను ప్రోత్సహించడం తప్పనిస్తే ఆమె ఎప్పుడూ రాజకీయాల్లోకి రావాలనుకోలేదు. నేను 38 ఏళ్లుగా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నాను. ఎప్పుడూ ప్రతిపక్ష నాయకులను చులకనగా మాట్లాడలేదు. రాజకీయం అంటే ప్రజల కోసం చేసేదని నమ్మాను. ఓటములు ఎదురైనా సానుకూలంగా తీసుకుని ముందుకెళ్లాను. రాష్ట్ర ప్రయోజనాలే లక్యంగా రాజకీయాలు చేశాను’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.