వీఆర్ఏల నిరవధిక దీక్షకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రభుత్వం ప్రకటించిన న్యాయమైన డిమాండ్ల కోసం వీఆర్ఏ లు చేపట్టిన నిరవధిక సమ్మె ఐదవ రోజు కు చేరింది.

రాయికోడ్ జనం సాక్షి జూలై 29  రాయికోడ్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు దీక్ష చేపట్టిన వీఆర్ఏ ల వద్దకు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు చేరుకుని  సంఘీభావం ప్రకటించి వారితో పాటు నాయకులు నినాదాలు చేస్తూ బైఠాయించారు. అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలాజీ నర్సింలు మాట్లాడుతూ వీఆర్ఏ ల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని, వెంటనే పేస్కెల్ జిఓ ను అమలు చేసి కారుణ్య నియామకాలను అనుమతించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగి రాకుంటే పార్టీ ఆదేశానుసారం బహిరంగ ఉద్యమాలు సైతం వెనుకడమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మద్దతు తెలిపిన వారిలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్లంపల్లి సొసైటీ చైర్మన్ నాగిశెట్టి, ఉపాధ్యక్షుడు గువ్వ గణేష్(వినయ్),మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అవుసలి ప్రభాకర్, రాయికోడ్ ఎంపిటిసి సిర్గాపూర్ మొగులప్ప, సర్పంచులు కేదారినాథ్ పాటిల్, నరేష్, శ్రీనివాస్ రెడ్డి, నాయకులు సతీష్, పాండు, వెంకట్ రెడ్డి, కార్యకర్తలు ఉన్నారు.. ఈ సమ్మెలో రాయికోడ్ మండల వీఆర్ఏ సంఘం అధ్యక్షుడు జిపి రత్నం, ఉపాధ్యక్షుడు శివకుమార్, కార్యదర్శి శ్రీశైలం, సలహాదారు గోపాల్ మరియు మండల వీఆర్ఏ లు పాల్గొన్నారు..