వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని 3వరోజు కొనసాగుతున్న నిరాహార దీక్ష…

బూర్గంపహాడ్ జూలై 27(జనంసాక్షి)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో వీఆర్ఏ లు తహసిల్దార్ కార్యాలయం ముందు తమ డిమాండ్లు తీర్చాలని స్థానిక జిల్లా వీఆర్ఏల జిల్లా కార్యదర్శి బర్ల ముత్యం, స్థానిక మండల వీఆర్ఏల అధ్యక్షుడు బర్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బర్ల ముత్యం మాట్లాడుతూ…. 9 -9 -2020 న కేసీఆర్ వీఆర్ఏ ల ను రెగ్యులరైజేషన్ చేస్తానని వీఆర్ఏలకు పే స్కేల్ జీవో అమలు చేస్తానని హామీ ఇచ్చి ఇప్పటికి రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ హామీ నెరవేర్చకపోగా, దాని ఊసే ఎత్తకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఉద్యోగస్తుల విషయంలో హామీలు ఇస్తూ అమలుకు పూనుకోకుండా కాలం గడుపుతూ, పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు.
ఈ ధోరణి వల్ల వి ఆర్ ఎ లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి వెంటనే చొరవ చూపాలని
పే స్కేల్ జీవోను విడుదల చేసి అమలు చేయాలని 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏలకు పెన్షన్ మంజూరు చేయాలని
అర్హులైన వారికి వారసత్వం ఉద్యోగాలు ఇవ్వాలని ప్రస్తుతం వీఆర్ఏల జీతాలు పెరుగుతున్న నిత్యవసర ధరల అనుగుణంగా జీతాలు పెంచాలని,
అర్హత కలిగిన వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల వీఆర్ఏలు భద్రాచలం వీఆర్ఏలు పాల్గొన్నారు. వీరికి బీఎస్పీ పార్టీ నాయకులు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు.
Attachments area