వీఆర్ఏ ల సమ్మెకు యుటిఎఫ్ సంపూర్ణ సంఘీభావం
కరకగూడెం,ఆగస్టు11(జనంసాక్షి): గత 18 రోజులుగా వీఆర్ఏలు నిర్వహిస్తున్న సమ్మెకు ఉపాధ్యాయ సంఘం యుటిఎఫ్ నుండి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్టు యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి బాధావత్ రాము సమ్మె శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వారికి పిఆర్సి జీవో విడుదల చేసి తక్షణమే అమలుపరచాలని ప్రభుత్వం వారి సమస్యలను పరిశీలించి పరిష్కరించాలని కోరారు. ప్రతి రంగంలో ప్రమోషన్లు ఇస్తున్నట్లే వీఆర్ఏల నుండి అర్హతల మేరకు ప్రమోషన్లు కల్పించాలని, మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరారు. కరోనా కాలంలో రెవెన్యూ యంత్రాంగం చాలా కష్టపడ్డారని ప్రజల బాగోగులు మొత్తం భుజస్కందాలపై వేసుకొని చూసారని అటువంటి ఉద్యోగులు వారి కుటుంబ పోషణ అన్ని విషయాల్లో చూసుకున్నప్పుడు వారి యొక్క జీతభత్యాల యొక్క ప్రభావం చూపిస్తున్నదని తక్షణమే పిఆర్సి జీవో విడుదల చేసి అమలుపరచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు సాధన పల్లి ప్రవీణ్ కుమార్, సాగబోయిన బాలకృష్ణ, నరేష్, ఆనందరావు, శ్రీను, పుల్లయ్య, బుచ్చి రాములు తదితరులు పాల్గొన్నారు.