వీబీజేఏ విజ్ఞప్తితో స్పందించిన మంత్రి


-బాధిత కుటుంబానికి అండ..!!
-కోవిడ్ తో రోడ్డునపడ్డ కుటుంబానికి 10 వేల తక్షిణ సాయం
-పిల్లల చదువు, తల్లికి ఉపాధి హామీ

మహబూబాబాద్ బ్యూరో-ఆగస్టు10(జనంసాక్షి)

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం విశ్వబ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన చిలుముల ప్రసాద్ చారి కోవిడ్ మూలంగా అకాల మరణం చెందడంతో ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయి దిక్కులేని స్థితిలో ఉండగా విషయం తెలుసుకున్న విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ అసోసియేషన్ మహబూబాబాద్ జిల్లా కమిటీ కుటుంబ స్థితిని మంత్రి సత్యవతి రాథోడ్ దృష్టికి తీసుకుపోగా, మంత్రి స్పందించి గురువారం ఆమె నివాసానికి బాధిత కుటుంబ సభ్యులను రప్పించి వారి స్థితిగతులను తెలుసుకొని తక్షణ సాయంగా 10 వేల రూపాయలు అందిస్తూనే, తల్లి చిలుముల స్రవంతి కి ఏదేని గురుకుల పాఠశాలలో ఔట్సోఅర్చింగ్ ఉద్యోగంతోపాటు పిల్లల చదువుల కోసం గురుకుల సీటు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఇలాంటి కుటుంబ స్థితిని తన దృష్టికి తీసుకొచ్చిన జిల్లా విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గుండోజు శ్రీనివాస్, అలాగే ఈ విషయంలో అనుసంధాన కర్తగా పెద్దన్న పాత్ర పోషించిన ఐజేయూ జిల్లా అధ్యక్షులు చిత్తనూరి శ్రీనివాస్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐజెయు జిల్లా అధ్యక్షులు చిత్తనూరి శ్రీనివాస్, విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గుండోజు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వీరంటి ముఖేష్, స్టేట్ కమిటీ సభ్యులు గుండోజు దేవేందర్, కోశాధికారి గుండోజు సుబ్రహ్మణ్య శాస్త్రి, ఉపాధ్యక్షులు రవీంద్ర చారి, వెలగలేటి కిరణ్ కుమార్, రామాచారి, వినయ్, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు