వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల స్ఫూర్తితో ముందుకు సాగుదాం
గిరిజన సంఘం జిల్లా నాయకులు మాలోత్ కిషన్ నాయక్
కురవి సెప్టెంబర్-16 (జనం సాక్షి న్యూస్)
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల స్ఫూర్తితో కురవి మండల కమిటీ
ఆధ్వర్యంలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మాలోత్ కిషన్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల్లో భూమి కోసం,భుక్తి కోసం,వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన పోరాటంలో ఎంతో మంది అమరులయ్యారని వారు గుర్తు చేశారు. సాయుధ పోరాటం కమ్యూనిస్టుల నాయకత్వాన సుదీర్ఘ పోరాటం జరిగిందని ఈ సాయుధ పోరాటంలో పది లక్షల ఎకరాల భూమిని పేదలకు కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగిందని, ఇది ఎర్రజెండా యొక్క గొప్పతనం అని వారు గుర్తు చేశారు.భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన పోరాటాల్లో నాలుగువేల మంది రక్తార్ఫణం చేశారని ఆ పోరాట స్ఫూర్తితో వీరనారి చిట్యాల ఐలమ్మ,దొడ్డి కొమరయ్య,భీమిరెడ్డి నర్సింహారెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య,టను నాయక్,మల్లు స్వరాజ్యం ఎంతోమంది సుదీర్ఘ పోరాట ఫలితంగా ఎంతో ప్రజలకు విముక్తి వచ్చిందని ఆయన అన్నారు.కానీ ఆనాటి నుండి నేటి వరకు కమ్యూనిస్టులు నాయకత్వంలో ఆ స్ఫూర్తితో కార్మికుల కర్షకుల పీడిత ప్రజల విముక్తి కోసం నిరంతరం కొనసాగిస్తున్నారని అన్నారు నేటి పాలకులు అధికారంలో ఉన్న బిజెపి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఏ సంబంధం లేకుండానే సాయుధ పోరాటంలో మా పాత్ర ఉందని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. దేశంలో హిందూ ఎజెండా పేరుతో కులం మతం ప్రాంతం పేరుతో రెచ్చగొట్టి దేశాన్ని నాశనం చేస్తున్నారని సాయుధ పోరాటాన్ని కూడా హిందూ ముస్లింల పోరాటంగా చిత్రీకరించి సాయుధ పోరాటాన్ని అవమానపరుస్తున్నారని ఇలాంటి ప్రభుత్వాలకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని,తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి అసలుసిసలైన వారసులు కమ్యూనిస్టులేనని అన్నారు.వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బానోత్ సీతారాం నాయక్,బానోత్ శంకర్,వాంకుడోత్ రమేష్ నాయకు, దేవా బానోత్ ,బాలాజీ , బానోత్ చందు, బానోత్ చిన్న, భానోత్ రవి,బానోత్ దేవా తదితరులు పాల్గొన్నారు.