వెంకటేశ్వర్లు సేవలు చిరస్మరణీయం
ఆదిలాబాద్, జూన్ 12 (జనంసాక్షి): ప్రజల మనిషిగా, జిల్లాకు కలెక్టర్‌గా ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని జిల్లా కలెక్టర్ అశోక్ అన్నారు. జిల్లాలో పని చేసిన దివంగత కలెక్టర్ వెంకటేశ్వర్ల మృతికి సంతాప సూచకంగా కలెక్టర్ సమావేశ మందిరంలో సంతాప సభను ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ వెంకటేశ్వర్లు చేసిన సేవలను ఆయన గుర్తు చేశారు. వెంకటేశ్వర్ల చిత్ర పటానికి పూలమాలలు వేసి రెండు నిమిషాల పాటు మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు. వెంకటేశ్వర్లు జిల్లాకు ఉన్న అనుంబంధాన్ని, జిల్లా ప్రజలకు చేసిన సేవలను ఎవరు మర్చిపోరని కలెక్టర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ శివారులోని మావాల గ్రామపంచాయితీలో పేదలకు ఇళ్ల స్థలాలను అందించేందుకు దివంగత కలెక్టర్ వెంకటేశ్వర్లు ప్రత్యేక శ్రద్ధతో 50 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడని, అందులో ఏర్పాటు చేసే కాలనీకి ఆయన పేరు పెడతామని కలెక్టర్ ప్రకటించారు. ఈ సం తాప సభలో ఐటిడిఎ డివో రాజు, అదనపు జేసీ వీరానుమల్లు, వివిధ శాఖల అధికారులు, గిరిజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.