వెంకయ్య ఇంట్లో విందుకు కేసీఆర్‌, కేటీఆర్‌

ఢిల్లీ జ‌నంసాక్షి : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హస్తినలో బిజీబిజీగా గడుపుతున్నారు. నిన్న జరిగిన నీతి ఆవాస్‌ యోజనలో పాల్గొన్న కేసీఆర్‌ ఈ రోజు ఉదయం నుంచి పలువురు కేంద్రమంత్రులను కలిశారు. తెలంగాణలో వాటర్‌గ్రిడ్‌కు సహకరించాలని కేంద్రమంత్రి బీరేంద్ర సింగ్‌ను, కేసీఆర్‌ కోరారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడి ఇంట్లో ఏర్పాటు చేసిన విందులో కేసీఆర్‌, ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నట్లు తెలిసింది.