వెయ్యికాళ్ల మండపాన్ని పునర్నిర్మించాలి: రోజా
తిరుమల,సెప్టెంబర్1(జనం సాక్షి ): వెయ్యికాళ్ల మండపాన్ని తిరిగి నిర్మించాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా డిమాండ్ చేశారు. మండపాన్ని కూల్చివేయడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె విూడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చివేయడం దారుణం అన్నారు. విషయాన్ని చాలా సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని ఆరోపించారు. ప్రజల మనోభావాలని దెబ్బతీసేలా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాగానే వెయ్యికాళ్ల మండపాన్ని తిరిగి నిర్మిస్తామని హామి ఇచ్చారు. కుటుంబ సభ్యులతో కలసి ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు.