వెలగపూడిలో వైకాపా రాస్తారోకో
ఒంగోలు,ఆగస్ట్31(జనం సాక్షి): వైసిపి రాష్ట్ర కార్యదర్శి వరికూటి అశోక్‌బాబు ఆధ్వర్యంలో శుక్రవారం వెలగపూడి గ్రామస్తులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట రాస్తారోకో నిర్వహించారు. వైసిపి రాష్ట్ర కార్యదర్శి వరికూటి అశోక్‌బాబు మాట్లాడుతూ.. వెలగపూడి గ్రామ పేదలకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పటికీ, పేదలకు ఇళ్ల పట్టాలిచ్చినట్లు రికార్డులు లేవని చెబుతూ ఎమ్మెల్యే స్వామి పేదల భూములను బలవంతంగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. గ్రామస్తుల ఆందోళనతో టంగుటూరు కొండేపి రహదారిపై వాహనాలు నిలిచిపోయి కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర కార్యదర్శి వరికూటి అశోక్‌బాబుతో పాటు వెలగపూడి గ్రామస్తులు పాల్గొన్నారు.