వేధిస్తున్న భర్తను చంపిన భార్య

కరీంనగర్‌,  పీకల దాకా మద్యం తాగి వచ్చి రోజూ వేధిస్తున్న భర్తను కడతేర్చిన భార్య ఉదంతం కరీంనగర్‌ జిల్లాలో శుక్రవారం జరిగింది. వెల్లటూరు మండలం పాతగూడూరు గ్రామంలో మద్యం తాగి వచ్చి వేధిస్తున్న భర్త గట్టయ్యను భార్య అంజమ్మ (45) బండతో మోది హతమార్చింది. అనంతరం అంజమ్మ పోలీసులకు లొంగిపోయింది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.