వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. సోమవారం కావడంతో ఉదయాన్నే భక్తులు తరలివచ్చి, ధర్మగుండంలో స్నానాలు చేశారు. కోడె మొక్కుకోసం క్యూలో నిల్చున్నారు. కల్యాణకట్టలో పిల్లల పుట్టువెంట్రుకలు తీయిస్తున్నారు. శీఘ్ర, ధర్మ, ప్రత్యేక దర్శనం కోసం బారులు తీరారు. ఆలయ కళాభవన్‌లో కల్యాణాలు జరిపిస్తున్నారు. అభిషేక, అన్న, కుం కుమపూజలు, ఆకు పూజలు నిర్వహిస్తున్నారు. నిన్న గండదీపం, పల్లకీసేవ, వివిధ ఆర్జిత సేవల ద్వారా రాజన్నకు రూ. 8 లక్షల ఆదాయం సమకూరినట్లు, 20 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.