వేరుశనగ రైతులను ఆదుకోవాలి: సిపిఎం

అనంతపురం,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి ): సకాలంలో వర్షాలు కురవకు ముందస్తు వర్షాలకు విత్తుకున్న రైతుల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ తెలిపారు. వ్యవసాయ అధికారులు కూడా జూన్‌ మాసంలో వేసిన పంటలు సుమారు 3 లక్షల హెక్టార్లులో సాగుచేసిన పంట పూర్తిగా పనికిరాదని చెబుతున్నారన్నారు. మిగిలిన 40 శాతంలో విస్తీర్ణంలో సాగుచేసిన పంటకు కచ్చితంగాచేతికి వస్తుందనే నమ్మకం లేదన్నారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంట బీమాలను ఎగ్గొట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రపన్నారని తెలిపారు. గతంలో జిల్లాలోని రైతులందరికీ ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇప్పటికి 40 శాతం మందికి ఇవ్వలేదన్నారు. భవిషత్తును దృష్టిలో ఉంచుకుని రైతులు ముందస్తు వర్షాలకు వేరుశనగ సాగుచేసి తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ఇప్పటికైన ప్రజా ప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయిలో పంటను పరిశీలించి నష్టపరిహారాన్ని అంచనాలు వేసి వాటిని రికార్డులో పొందు పరిచాలని తెలిపారు.

————————–

 

తాజావార్తలు