వైద్యుల పనితీరుపై మండిపడ్డ మంత్రి హరీష్‌ రావు

మెరుగైన సేవలు అందించడంలో విఫలం
పద్దతి మార్చుకోవాలని హెచ్చరిక

సంగారెడ్డి,అగస్టు3(జనం సాక్షి): రామచంద్రాపురం ఈఎస్‌ఐ ఆసుపత్రి వైద్య సిబ్బంది పనితీరుపై రాష్ట్ర
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు మండిపడ్డారు. ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తున్నా మెరుగైన వైద్యం అందించటంలో వైద్య సిబ్బంది చొరవచూపకపోవటం, నిర్లక్ష్య ధోరణి వహించటంపై విరుచుకుపడ్డారు. సంగారెడ్డి జిల్లా ఆర్‌ సి పురం ఈఎస్‌ఐ ఆసుపత్రిలో దాదాపు 20 కోట్ల 73 లక్షల రూపాయలతో చేపట్టిన ఆధునికీకరణ పనులను రాష్ట్ర మంత్రులు హరీష్‌ రావు, మల్లారెడ్డి, లాంచనంగా ప్రారంభించారు. అనంతరం ఈఎస్‌ఐ ఆసుపత్రిలో జరుగుతున్న వైద్యవిధానం, వైద్యుల పనితీరుపై డాక్టర్లు, వైద్య సిబ్బందితో మంత్రి హరీష్‌ రావు సవిూక్ష నిర్వహించారు. ఈఎస్‌ఐ ఆసుపత్రిలో కనీసం 40శాతం కూడా రోగులు రాకపోవటంపై మంత్రి హరీష్‌ రావు ఆసుపత్రి వైద్య సిబ్బందిని ప్రశ్నించారు. నాలుగేళ్ల నుంచి డ్యూటికి రాని వైద్య సిబ్బందిపై ్గªరైయ్యారు. విధులకు హాజరుకాని వారిని తీసేయాలని ఆదేశించారు. ఈఎస్‌ఐ ఆసుపత్రిలో అన్ని వసతులు కల్పించి ఎనిమిది నెలలు కావస్తున్నా ఒక్క డెలివరీ కూడా చేయలేకపోవటంపై వైద్యులపై మంత్రి గుస్సా అయ్యారు. పటాన్‌ చెరు ఏరియా ఆసుపత్రి నుంచి సీటీ స్కాన్‌, బ్లడ్‌ ఇతర సదుపాయాలను ఈఎస్‌ఐ ఆసుపత్రి వారు వాడుకోవచ్చని మంత్రి సూచించారు.
మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల కార్మికులకు ప్రభుత్వం ఆధునిక వసతులతో వైద్యం అందిస్తుందన్నారు. కరోనా సమయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా కార్మికులను ఆరోగ్యంగా వారి గమ్యస్థానాలకు చేర్చామని తెలిపారు. ఈఎస్‌ఐలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు పూర్తిస్థాయిలో బర్తీ చేస్తామని, పటాన్‌ చెరులో 30 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
అనంతరం ఈఎస్‌ఐ ఆసుపత్రిలో జరుగుతున్న వైద్యవిధానం, వైద్యుల పనితీరుపై డాక్టర్లు, వైద్య సిబ్బందితో మంత్రి హరీష్‌ రావు సవిూక్ష నిర్వహించారు.