వైద్య పరిశోధనలకు సోమ్‌నాథ్‌ భౌతిక కాయం

సిపిఎం నేత సీతారం ఏచూరి వెల్లడి

కోల్‌కతా,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): కన్నుమూసిన లోక్‌సభ మాజీ స్పీకర్‌ సోమనాథ్‌ ఛటర్జీ భౌతిక కాయాన్ని ఆయన కోరిక మేరకు వైద్య పరిశోధకులకు అప్పగించనున్నారు. కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కేఎం హాస్పటల్‌కు .. ఛటర్జీ కాయాన్ని అందించనున్నారు. సేత్‌ సుఖ్‌లాల్‌ కర్ణాని మెమోరియల్‌ హాస్పటల్‌ను సాధారణంగా పీజీ హాస్పటల్‌గా పిలుస్తారు. ఇక్కడ అనేక పరిశోధనలు జరుగుతుంటాయి. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 89 ఏళ్ల సోమనాథ్‌.. సోమవారం తుది ప్రాణాలు విడిచారు. ఛటర్జీతో పాటు అనేక మంది తమ పార్టీ నేతలు మెడికల్‌ రీసర్చ్‌ కోసం తమ శరీరాలను దానం చేశారని సీపీఎం నేత సీతారామ్‌ ఏచూరితెలిపారు. అయితే వైద్యులకు అప్పగించడానికి ముందు.. పార్టీ ఆఫీసులో పార్థీవదేహాన్ని ప్రజల సందర్శన కోసం ఉంచనున్నారు. అక్కడే తుది నివాళ్లు అర్పిస్తారు. ఆ తర్వాత సోమనాథ్‌ పార్థీవ దేహాన్ని బెంగాల్‌ అసెంబ్లీకి తరలిస్తారు. అయితే సోమనాథ్‌ కుటుంబసభ్యులతో చర్చించిన తర్వాత తుది కార్యక్రమాలను వెల్లడిస్తామని ఏచూరి తెలిపారు. ఛటర్జీ భౌతికదేహాన్ని బెల్లి వ్యూ క్లినిక్‌ నుంచి మొదట హైకోర్టుకు తీసుకువెళ్లనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఛటర్జీ చాన్నాళ్లు హైకోర్టులో పని చేశారని, ఆయనకు కోర్టుతో ప్రత్యేక అనుబంధం ఉందని ఆమె అన్నారు. కోర్టు నుంచి రాష్ట్ర అసెంబ్లీకి ఛటర్జీ పార్ధీవదేహాన్ని తరలిస్తామన్నారు. అక్కడ ప్రభుత్వ లాంఛనాలతో నివాళ్లు అర్పిస్తామని దీదీ తెలిపారు. అసెంబ్లీ నుంచి పార్ధీవ దేహాన్ని కుటుంబసభ్యులు ఇంటికి తీసుకువెళ్లనున్నట్లు బెనర్జీ తెలిపారు. ఆ తర్వాత ఛటర్జీ దేహాన్ని ఎస్‌ఎస్‌కేఎం హాస్పటల్‌ డాక్టర్లు ఆధీనంలోకి తీసుకుంటారన్నారు.

హరివంశ్‌ సంతాపం

మాజీ స్పీకర్‌ సోమ్‌నాథ్‌ ఛటర్జీ మృతిపట్ల రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఛటర్జీ ఉపన్యాసాలు, లోక్‌సభ స్పీకర్‌గా వ్యవహరించిన తీరు రాజకీయాల్లోకి రాబోయే వారికి మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. పార్లమెంట్‌కు ఛటర్జీ లాంటి వ్యక్తి అవసరమని హరివంశ్‌ పేర్కొన్నారు. లోక్‌సభ మాజీ స్పీకర్‌ సోమ్‌నాథ్‌ ఛటర్జీ మృతి తీవ్ర దిగ్భాంతికి గురి చేసిందని లోక్‌సభ మాజీ స్పీకర్‌ విూరా కుమార్‌ పేర్కొన్నారు. ఆయన అద్భుతమైన వ్యక్తిని విూరా కుమార్‌ కొనియాడారు. ఛటర్జీ కూర్చున్న చైర్‌లో స్పీకర్‌గా తాను కూర్చోవడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. ఛటర్జీ మృతి చెందడాన్న వార్తను నమ్మలేకపోతున్నానని తెలిపారు. ఆయనకు అనారోగ్యానికి గురైనట్లు తెలుసు కానీ.. ఈ విధంగా జరుగుతుందని ఊహించలేకపోయానని విూరా కుమార్‌ పేర్కొన్నారు. సోమ్‌నాథ్‌ ఛటర్జీ గొప్ప పార్లమెంటే రియన్‌, గొప్ప పాండిత్యం కల వ్యక్తి అని రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్‌ హావిూద్‌ అన్సారీ తెలిపారు. లోక్‌సభ చైర్‌కే ఛటర్జీ కొత్తవన్నె తీసుకొచ్చారు. గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని కోల్పోవడం బాధాకరంగా ఉందన్నారు. భారత ప్రజలు ఆయనను జీవితాంతం గుర్తుంచుకుంటారని అన్సారీ పేర్కొన్నారు.

——–