వైద్య రంగానికి పెద్ద పీట వేసిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. -గ్రామీణ ప్రాంతాలలోని కీలకమైన పాత్ర ఆర్ఎంపీ డాక్టర్ల దే

-గ్రామీణ ప్రాంతాలలోని ఆర్ఎంపీ పి.ఎం.పి వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలు అగిపోయిన గవర్నమెంట్ ట్రైనింగ్ క్లాసులు విషయాలపై చర్చ.
-ఆర్ఎంపీ పి.ఎం.పి డాక్టర్లు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే.
గద్వాల నడిగడ్డ సెప్టెంబర్ 25 జనం సాక్షి.
గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు జోగులాంబ గద్వాల జిల్లా ఆర్.ఎం.పి, పి .ఎం.పి డాక్టర్ల సమస్యలను, ఆత్మీయ సమావేశానికి ముఖ్యఅతిథిగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు.ఎమ్మెల్యే కి ఆర్ఎంపీ డాక్టర్లు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు.ఆర్ఎంపీ డాక్టర్లు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ఎన్నో సంవత్సరాల నుండి ప్రజలకు వైద్యము అందిస్తున్నాం. గతంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది. నేడు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రంలో ఎమ్మెల్యే సహకారంతో గద్వాల నియోజకవర్గం గ్రామాలలో సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యము అందిస్తూ వారికి ఎల్లవేళలా అండగా ఉంటూ ప్రజా ఆరోగ్యం కోసం అహర్నిశలు శ్రమించి అనుకోని సందర్భాలలో ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు వాటిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చి వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేయడం జరిగింది అన్ని విధాలుగా ఆర్ఎంపి డాక్టర్లకు ఎమ్మెల్యే అండగా నిలవడం జరిగిందనారు.అదేవిధంగా ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వంతో దృష్టికి ఆరోగ్యశాఖ మంత్రి కి దిష్టికి ఆర్ఎంపి ,పి.ఎం పి డాక్టర్ల సమస్యలను తీసుకువెళ్లి గవర్నమెంట్ ట్రైనింగ్ క్లాసులు త్వరగా పూర్తి అయ్యే విధంగా కృషి చేయాలి అదేవిధంగా మా అంటే ఒక గుర్తింపు కార్డును గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చే విధంగా కూడా కృషి చేయాలని కోరారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో గ్రామీణ ప్రాంతాలలో సామాన్య మానవులకు ఏ చిన్న ఆపద వచ్చిన ముందుగా గుర్తుకొచ్చి వ్యక్తి ఆర్ఎంపీ డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్ ప్రజలకు మెరుగైన ప్రధమ చికిత్సలు చేసి వారికి ఎక్కువ ఇబ్బందిగా ఉంటే ప్రభుత్వ ఆసుపత్రులకు పంపించేవారు ఏ క్షణమైనా అలాంటి ఇబ్బంది వచ్చిన వారికి తక్షణమే గ్రామాలలో ఉండి సేవలను అందించేవారు. నేడు కూడా వారి సేవలు గ్రామీణ ప్రాంతాలలో కొనసాగుతున్నాయి ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తూ పేద ప్రజల ప్రాణాలు కాపాడుతూ డాక్టర్ దేవుడు రూపంలో వారికి సహాయం చేస్తూ వైద్యపరంగా వారికి అన్ని విధాలుగా అండగానించడం జరుగుతుంది.నేను ఇప్పటికి ఏ చిన్న సమస్య వచ్చినా ముందుగా ఆర్ఎంపీ డాక్టర్ల సలహా సూచనలు పాటించి జరుగుతుందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సారధ్యంలో రాష్ట్రంలో అన్ని విధాలుగా వైద్యరంగం ప్రజలకు అందుబాటులో రావడం జరిగింది గతంలో ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రజలు వెళ్లాలంటే సరైన వైద్యము లభించవలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కునేవారు ఏ చిన్న సమస్య వచ్చినా ప్రవేట్ , హైదరాబాద్ కర్నూల్ వంటి ప్రాంతాలకు వెళ్లి కూడా ఆసుపత్రులకు వెళ్లి చికిత్సలు పొందేవారు. కానీ నేడు వాటికి భిన్నంగా ఉంది రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యము అందించడం జరుగుతుంది ప్రజలకు ఎల్లప్పుడూ వైద్యులు అందుబాటులో ఉండడం జరుగుతుంది. ప్రైవేట్ దవఖానాలు వద్దు ప్రభుత్వ దౌఖానాలకు ముద్దు అంటూ మారిన పరిస్థితి నేడు మనము ప్రభుత్వాసుపత్రిలో చూస్తున్నాం గతంలో ఓపీలు 100 మాత్రమే ఉండేది కానీ నేడు 700 వరకు ఓపీలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్న ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్లు, డయాగ్నొస్టిక్ సెంటర్ ను రేడియాలజీ, హబ్ ల్యాబ్ లో ఏర్పాటు చేయడం జరిగింది అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన పరికరాలు కూడా ఆధునీకరమైన పరికరాలు గద్వాల ప్రభుత్వాసుపత్రిలో ఉన్నాయి ఈ ప్రాంతం నుండి ఇతర ప్రాంతాలకు వైద్య అవసరాలకు వెళ్లే పరిస్థితి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన వైద్య పరికరాలను వైద్యులను ఏర్పాటు చేయడం జరిగింది.
అదేవిధంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతంలోని విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లి నర్సింగ్ మెడికల్ సంబంధించిన చదువులు నర్సింగ్ కాలేజీ మంజూరు చేయడం జరిగింది. రెండు సంవత్సరాలు పూర్తి అయినది. మెడికల్ కాలేజీ కూడా గద్వాల ప్రాంతానికి మంజూరు కావడం జరిగింది భవిష్యత్తులో అన్ని రంగులతో అన్ని రకాల వైద్య రంగాలతో ఆధునీకరమైన ప్రైవేట్ ఆసుపత్రిలో దీటుగా మెడికల్ కాలేజీ పూర్తి చేయడం జరుగుతుంది ఈ ప్రాంతంలోని విద్యార్థులు ఇక్కడనే చదువుకొని గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజలకు మెరుగైన వైద్య అందించే విధంగా వైద్యరంగం మరింత బలోపేతం చెందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేయడం జరుగుతుంది 300 పడకల ఆసుపత్రి కూడా గద్వాల నియోజకవర్గంలో పనులు కొనసాగుతున్న త్వరలో పూర్తి తీసుకుని ప్రజలకు అందుబాటులోకి రావడం జరుగుతుంది అని పేర్కొన్నారు.
ఆర్.ఎం.పి పీ.ఎం పీ డాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను గవర్నమెంట్ లో ట్రైనింగ్ క్లాసులను విషయాని ముఖ్యమంత్రి దృష్టికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి త్వరలోనే తీసుకెళ్లి మీ సమస్యను పరిష్కరించే విధంగా నా వంతు కృషి చేస్తానని తెలిపారు. రాబోయే ఎన్నికలలో సీఎం కేసీఆర్ ని నన్ను మరొక్కసారి మీరందరూ ఆశీర్వదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ ఎంపీపీ విజయ్, గట్టు మండల పార్టీ అధ్యక్షుడు రామకృష్ణ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాగర్ దొడ్డి వెంకట రాములు, శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ఎంపీ డాక్టర్ల జిల్లా అధ్యక్షుడు మురళి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి హుస్సేన్, తాహీర్,ఆర్ఎంపీ డాక్టర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు.